
621views
న్యూఢిల్లీ: ఇస్లాం రాజకీయం వలే, బుర్ఖా/హిజాబ్ కూడా నేడు రాజకీయం అయిందని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. కర్ణాటకలోని ఉన్నత విద్యా సంస్థల్లో తమని హిజాబ్ (శిరోవస్త్రం)తో ప్రవేశించనివ్వాలని అక్కడి కొందరు ముస్లిం విద్యార్థినులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
“వేరే మార్గం లేనప్పుడే వారు హిజాబ్‌ను ధరించక తప్పదు. ఇస్లాం రాజకీయం మాదిరిగా నేడు బుర్ఖా/హిజాబ్ కూడా రాజకీయం అయిపోయింది” అని తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో రాశారు.
“ముస్లిం మహిళలు బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్ మాదిరిగా చూడాలి. సంఘర్షణలను అరికట్టడానికి ఉమ్మడి పౌర స్మృతి, ఉమ్మడి యూనిఫారం అవసరమని నేను నమ్ముతున్నాను. మత హక్కు, విద్యా హక్కు కంటే ఎక్కువేమి కాదు” అని తస్లీమా న్యూస్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు.
Source: Nijamtoday