
-
ఇస్లామిస్టుల అరెస్టు!
మంగళూరు(కర్ణాటక): పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీ.ఎఫ్.ఐ) క్యాడర్ బాలికలను వ్యభిచారంలోకి దింపుతూ సెక్స్ రాకెట్లను నడుపుతోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పీ.ఎఫ్.ఐ నాయకుడు మహ్మద్ షరీఫ్ అలియాస్ షరీఫ్(46) అనే వ్యక్తిని మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నషరీఫ్ కర్ణాటక సరిహద్దు సమీపంలోని కేరళలోని మంజేశ్వరం సమీపంలోని ఉద్యవార్‌కు చెందినవాడు.
వ్యభిచార కూపంలోకి దింపేందుకు బాలికలను రవాణా చేస్తుంటాడు. ఈ రవాణా కేసులో ఇంకా గృహిణి రహ్మత్ (48), మెహందీ డిజైనర్ సనా అలియాస్ అస్మా, ఉమర్ కున్హి(43) అనే మటన్ స్టాల్ యజమాని, చేపల దుకాణం యజమాని మహమ్మద్ హనీఫ్(46) అరెస్టయ్యారు.
ఈ నెల ప్రారంభంలో పోలీసులు సౌత్ మంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్ నుండి ఇద్దరు విద్యార్థులను రక్షించారు. వ్యభిచార గృహ నిర్వాహకురాలు షమీనా, ఆమె భర్త, పింప్ అబూ బకర్ సిద్దిక్, ఆయిషా అనే ‘మేడమ్’ను అరెస్టు చేశారు. ఈ ఇస్లామిస్టులు వ్యభిచార రాకెట్‌ను నిర్వహిస్తున్నారని తెలిపారు.
17 ఏళ్ల బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని కాలేజీ అధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యభిచార గుట్టు బయటపడింది. తనను బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని విద్యార్థిని తన కళాశాల లెక్చరర్‌కు తెలిపిందని మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ గురువారం(ఈనెల 10) విలేఖరులకు తెలిపారు.
Jihadi sex racket busted in Mangalore, Arrested includes a SDPI leader Mohd Shariff from Kasargod
Victims are minor girls pic.twitter.com/FKmqfOjKuQ
— HKupdate (@HKupdate) February 10, 2022
కళాశాల ప్రిన్సిపాల్ శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి), స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కౌన్సెలింగ్ తర్వాత, ఆమె తమ కష్టాలను వివరించింది. దీంతో పోలీసులు అత్తావర్‌లోని అద్దె నివాసంపై దాడి చేశారు. నందిగుడ్డలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 5వ అంతస్తులో ఉన్న పెంట్‌హౌస్‌లో నిందితులు ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నారని కమిషనర్ తెలిపారు. నిందితులు రెండేళ్ళుగా ఇదే స్థలంలో ఈ అనైతిక వ్యాపారం చేస్తున్నారన్నారు.
కొత్తగా అరెస్టయిన వారిలో బిల్డింగ్ కాంట్రాక్టర్ సందీప్ (33), బిల్డింగ్ కాంట్రాక్టర్ అయిన సిప్రియన్ ఆండ్రేడ్ అలియాస్ ప్రవీణ్ డిసౌజా (40)ఉన్నారు. వీరంతా మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. షరీఫ్ కూడా మైనర్లపై అత్యాచారం చేశాడు.
Source: Hindupost