
5views
వందేమాతరం గేయాన్ని ఆలపించే సమయంలో ఎటువంటి ఆటంకం కలిగించినా దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం 1971 నాటి జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనివల్ల జాతీయ గీతం జనగణమన స్థాయిలో వందేమాతరానికీ రాజ్యాంగ రక్షణ లభించనుంది. ప్రస్తుత చట్టం.. జాతీయ గీతం, జాతీయ జెండా, రాజ్యాంగానికే ఈ రక్షణ కల్పిస్తోంది. ఈ చట్ట ఉల్లంఘనకు పాల్పడిన వారికి మూడేళ్ల జైలు శిక్షగానీ, జరిమానాగానీ, రెండూగానీ విధిస్తారు.
- చట్ట సవరణ తర్వాత వందేమాతరానికి అంతరాయం కలిగించే వారికి శిక్ష పడుతుంది.
- జాతీయ గీతం, జాతీయ గేయం కలిపి పాడేటప్పుడు బంకించంద్ర ఛటోపాధ్యాయ్ రచించిన వందేమాతరంలోని 6 చరణాలను ముందు ఆలపించాలని సూచిస్తూ ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.





