News

‘అగ్నివీర్’ వాలంటీర్లపై ముస్లిం మూక దాడి

585views

నోయిడా: వాట్సాప్ స్టేటస్‌గా ‘బీజేపీకి నా ఓటు’ అని పెట్టినందుకు ‘అగ్నివీర్’ వాలంటీర్‌పై ముస్లిం యువ‌కుల దాడికి పాల్ప‌డ్డారు. ఈ నెల 11న నోయిడాలో ధర్మ ప్రచార్, బేటి రక్ష, సోషల్ ఇంటిగ్రేషన్, గౌ సేవ కోసం పనిచేస్తున్న ఎన్‌జీవో అగ్నివీర్ వాలంటీర్లపై సలీమ్, సదాబ్, సల్మాన్, అల్తాఫ్, అఫ్రోజ్, వారి స్నేహితులు దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో రవి ఠాకూర్, పవన్ ఠాకూర్ అనే ఇద్దరు వాలంటీర్లు తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అగ్నివీర్ జాతీయ ప్రధాన కార్యదర్శి చిరాగ్ ఝా ఆ రోజు సాయంత్రం ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని మీడియాకు తెలిపారు. వాలంటీర్లు వీరేందర్ సింగ్ చౌదరి, అతుల్, అజయ్, రవి, పవన్ సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా, బుద్ధ విహార్ కాలనీలోని వారి నివాసం సమీపంలో దాడి చేశార‌న్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి