News

ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాద కుట్ర భగ్నం.. అల్ ఖైదా ఉగ్రవాది అరెస్ట్‌

444views

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆల్​ఖైదా తీవ్రవాది తాహీద్ అహ్మద్ ​షాను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అరెస్ట్ చేసింది. నిందితుడు ఇటీవల లఖ్​నవూలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్టు ఎన్​ఐఏ అధికారులు నిర్ధరించారు. “జమ్ముకశ్మీర్​లోని బుద్గాం జిల్లాకు చెందిన తాహీద్​పై గతేడాది జులైలోనే గోమతి నగర్ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఆల్​ఖైదా సంస్థలోకి యువతను తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడున్నాడన్న అభియోగాల మేరకు కేసు నమోదైంది.” అని ఎన్​ఐఏ పేర్కొంది. అంతకుముందు ఎన్​ఐఏ అధికారులు ఇదే కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఏజీహెచ్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంలో తాహీద్ మాస్టర్​ మైండ్​ అని ఎన్​ఐఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి