News

భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​!

432views

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్తాన్‌ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ తీర ప్రాంత రక్షకదళం అపహరించినట్టు స‌మాచారం.

ఓఖా, పోరుబందర్‌లకు చెందిన మత్స్యకారులను పాకిస్తాన్‌ బందీలుగా చేసినట్టు తెలుస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 17 బోట్లను, వంద మందికి పైగా మత్స్యకారులను పాకిస్తాన్‌ తీరప్రాంత రక్షణ దళం బందీలుగా చేసుకోవటంతో మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. భారత ప్రాదేశిక జలాల్లోనే చేపల వేటకు వెళ్తున్నప్పటికీ పాకిస్తాన్‌ అక్రమంగా అపహరిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త‌క్ష‌ణం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి