News

ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!

556views

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయ‌తీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు.

ఆ పోస్టర్లను కవర్ చేసేందుకు వెళ్లిన రోహిత్​ కుమార్..​ ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలువేశారు. ఈ క్రమంలో మందుపాతర పేలి అక్కడికక్కడే జర్నలిస్టు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే కలహందీ పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రోహిత్ మదన్​పుర్​- రామ్​పుర్ వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి