News

మారని పాకిస్థాన్ వక్రబుద్ధి!

397views
  • కశ్మీర్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామంటూ కారుకూతలు

న్యూఢిల్లీ: కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం.. మీ జోక్యం వద్దు అంటూ ఎన్ని సార్లు పాకిస్థాన్‌ను భారత్ మందలించిన పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ పాడిన పాత పాటనే పాడుతోంది. పాకిస్తాన్ అగ్ర నాయకత్వం శనివారం కశ్మీర్ ప్రజలకు తన మద్దతును తెలిపింది. కశ్మీర్ సమస్యపై ఇస్లామాబాద్ తన వైఖరిని విడనాడదని తెలిపింది. ‘కశ్మీర్ సంఘీభావ దినోత్సవం’ సందర్భంగా జరిగిన ర్యాలీలో అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ మాట్లాడుతూ, కాశ్మీరీ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని గుర్తించే ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా తమ దేశం కాశ్మీర్ వివాదానికి పరిష్కారాన్ని కోరుకుంటుందని అన్నారు.

పాకిస్తాన్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అయిదోతేదీన‌ ‘కశ్మీర్ సాలిడారిటీ డే’ని జరుపుకొంటుంది. కాశ్మీర్‌పై పాకిస్తాన్ వైఖరి మారలేదని.. తన బాధ్యతను వీడదని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ అన్నారు. కాశ్మీర్ మన శరీరంలో భాగమని, మన హృదయాలు కలిసి మెలిసి ఉన్నాయని దేశం వారికి అండగా నిలుస్తుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా.. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జమ్మూ-కశ్మీర్ సమస్య పరిష్కారానికి పాక్ కట్టుబడి ఉందని ఆరిఫ్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి