News

పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు

506views
  • 36 కిలోల హెరాయిన్ స్వాధీనం

జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు.

కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సరిహద్దు భద్రతా దళం బీఎస్​ఎఫ్​ గుర్తించింది. వారిని లొంగిపోవాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. దీంతో వారిని బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 ప్యాకెట్లలో(ఒక్కోటి కిలో) మత్తు మందును స్వాధీనం చేసుకున్నాయి అని అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లు పెరిగిన క్రమంలో ఈ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి