News

భారత కోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరు..

394views

ముంబయి: భారత కోకిలగా యావత్‌ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కొవిడ్‌ కారణంగా జనవరి 11న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే, జనవరి నెలఖారున కరోనా నుంచి కోలుకున్న లతా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆమెకు వైద్యులు చికిత్సనందించినా ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి మరెన్నో పుర‌స్కారాలు పొందిన లతా మంగేష్కర్ తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. లతా మంగేష్కర్‌ లేరన్న విషయాన్ని భార‌త జాతి జీర్ణించుకోలేకపోతోంది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి