
-
రూ.70 లక్షలతో ఆధునీకరణతో గదులు
తిరుపతి: స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్‌లో రూ 70 లక్షలతో ఆధునీకరించిన పేయింగ్ రూం లను ఆయన ప్రారంభించారు. గదుల్లో వసతులను పరిశీలించారు. అనంతరం శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలను అదుకోవడానికి టీటీడీ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు.
టీటీడీ అనేక రూపాలలో ఇప్పటికే స్విమ్స్‌కు సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా స్విమ్స్ నెఫ్రో ప్లస్ బ్లాక్ లో ఉన్న 95 గదులకు ఆక్సిజన్ సహా అన్ని వసతులు సమకూర్చి పేయింగ్ రూమ్‌లుగా ఆధునీకరిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఆధునీకరించిన 30 గదులను ప్రారంభించామని చైర్మన్ చెప్పారు. మిగిలిన 65 గదులను టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువస్తుందని ఆయన వివరించారు.





