News

అసొం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో మళ్ళీ కాల్పుల కలకలం

565views
  • రోడ్డు నిర్మాణంతో తలెత్తిన వివాదం

  • ఈశాన్య భారతంలో కొలిక్కిరాని సరిహద్దు వివాదాలు

అసొం: ఈశాన్య భారత్​లో సరిహద్దు వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఈ ఘటనలపై ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా అసోం, అరుణాచల్​ప్రదేశ్​ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే క్రమంలో తలెత్తిన వివాదంలో కాల్పులు జరిగినట్టు అధికారులు తెలిపారు.

అసోం, ధెమాజీ జిల్లా గోగాముఖ్​ ప్రాంతంలోని అరుణాచల్​ ప్రదేశ్​ సరిహద్దు సమీపంలో వివాదస్పద భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపట్టగా స్థానికులు ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు కాంట్రాక్టర్​ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటనపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

అసోం, అరుణాచల్​ ప్రదేశ్​ మధ్య జనవరి 24న చర్చలు జరిగిన రెండో రోజే సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై వివాదం చెలరేగటం ఆందోళనలు పెంచుతోంది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పేమా ఖండు సమావేశమై చర్చించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి