
-
స్వదేశంలో తయారీని ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం
న్యూఢిల్లీ: కనీస భద్రత, నాణ్యత ప్రమాణాల సాధన లక్ష్యంగా డ్రోన్ల ధ్రువీకరణ పథకంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ వెలువరించింది. దేశీయంగా తయారీని ప్రోత్సహించడానికి ఈ నిబంధనలు ఉపయోగపడుతాయని తెలిపింది.
డ్రోన్లకు ధ్రువీకరణను సులభంగా, త్వరగా, పారదర్శకంగా ఇచ్చేందుకు ఇవి దోహదపడుతాయని పేర్కొంది. డిజిటల్ స్కై అనే ఏక గవాక్ష విధానం, ఉత్పత్తి ముడిపడిన ప్రోత్సాహకాలు వంటివి డ్రోన్ల తాయారీ పరిశ్రమ ఎదుగుదలకు ఉపకరిస్తాయని తెలిపింది. దిగుమతిదారులకు, విడిభాగాలను తెచ్చి ఒకటిగా మార్చేవారికి కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నా అంశాలు వర్తిస్తాయని వెల్లడించింది.
డ్రోన్‌కు ధ్రువపత్రం కావాలని దరఖాస్తు చేసేవారు దాని బరువు, రకం, వేగం, పరిధి, మన్నిక, బ్యాటరీ పనితీరు, డ్రోన్‌ను వెనక్కి రప్పించే యంత్రాంగం, తయారీలో వాడిన సామగ్రి వివరాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది.





