News

అత్యంత విలువైన ఐటి బ్రాండ్లలో భారతీయ సంస్థలు ముందంజ‌

580views

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ బ్రాండ్ల జాబితాలో తొలి మూడు స్థానాల్లో రెండు భారత్‌కు చెందినవే కావడం విశేషం. అమెరికాకు చెందిన అత్యంత ప్రతిష్ఠాత్మక కంపెనీ ఐబీఎంను సైతం మన దిగ్గజాలు వెనక్కి నెట్టాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

ఏటా కంపెనీల బ్రాండ్‌ విలువను అంచనా వేసే ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌’ నివేదిక బుధవారం వెలువడింది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత విలువైన, పటిష్ఠమైన ఐటీ సేవల సంస్థగా యాక్సెంచర్‌ తన తొలిస్థానాన్ని పదిలం చేసుకుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి