News

జమ్మూ కాశ్మీర్‌లో పేలుడు కలకలం!

659views
  • గణతంత్ర వేళ విధ్వంసానికి ఉగ్రవాదుల వ్యూహరచన

  • హైఅలర్ట్ ప్రకటించిన భద్రతా దళాలు

జ‌మ్మూ: గణతంత్ర వేడుకల నేపథ్యంలో భద్రతా సిబ్బందిపై గ్రనేడ్​తో ముష్కరులు దాడి చేశారు. శ్రీనగర్​లో హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని ఓ సైనికాధికారి వెల్లడించారు. సిబ్బందిపై ముష్కరులు గ్రనేడ్​ విరిసరగా అది రోడ్​పైనే పేలిపోయిన కారణంగా భద్రతా సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపడుతున్నారు. జమ్ముకశ్మీర్​ కిష్త్వాడ్ జిల్లాలో 1.3 కేజీల పేలుడు పదార్థాలు ముష్కరుల నుంచి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి