News

ప్ర‌ధాని మోదీయే ల‌క్ష్యంగా పిచ్చి వేషాలేసిన ముస్లిం తండ్రీకొడుకుల అరెస్టు!

684views

జ‌మ్ముక‌శ్మీర్‌: సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వీడియో అప్​లోడ్ చేసిన కేసులో జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాకు చెందిన ముస్లీం తండ్రీకొడుకుల‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. బీజేపీ మద్దతుదారులు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చింగాస్​ ప్రాంతానికి చెందిన నిందితులు.. మోదీపై అభ్యంతరకర టిక్​టాక్​ వీడియోని ఫేస్​బుక్​లో అప్​లోడ్​ చేసినట్టు బీజేపీ మద్దతుదారులు ఆరోపించారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి