
-
మండిపడ్డ హిందూ సంఘాలు
-
తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల నిరసన ప్రదర్శన
-
విచారణకు కలెక్టర్ ఆదేశం
కర్ణాటక: కర్ణాటక, ముల్‌బాగల్‌లోని సోమేశ్వర పాలయ బాలే చంగప్ప ప్రభుత్వ కన్నడ మోడల్ స్కూల్‌లోని ముస్లిం విద్యార్థులు తరగతి గదిలో నమాజ్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల పూర్వ విద్యార్థులు, హిందూ సంఘాలు నిరసనకు దిగాయి.
ప్రధానోపాధ్యాయురాలు ఉమా దేవిని ఆందోళనకారులు ప్రశ్నించగా, బయట ఉన్నందున ఆ విషయం తనకు తెలియదని చెప్పారు. ఇండియా టుడేకు ఆమె ఇలా చెప్పింది.. ‘నాకు దీని గురించి ఏమీ తెలియదు. నేను చేయలేదు. విద్యార్థులు స్వయంగా చేశారు. ఇది జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పారు.. దాంతో నేను పాఠశాలకు పరుగెత్తాను’..

ఇదిలావుండగా, పాఠశాల తెరిచినప్పటి నుంచి రెండు నెలలుగా తరగతి గదిలోనే నమాజ్ చేస్తున్నామని ముస్లిం విద్యార్థులు తెలిపారు. పాఠశాల ఆవరణలో నమాజ్ చేసుకునేందుకు హెచ్‌ఎం అనుమతి ఇచ్చారని కూడా చెబుతున్నారు. ముస్లిం విద్యార్థులు నమాజ్ చేయడానికి సమీపంలోని మసీదులకు వెళ్ళవలసి ఉన్నందున తాను వారికి అనుమతి ఇచ్చానని హెచ్‌ఎం విద్యా శాఖ అధికారులకు తెలిపినట్టు మరో వాదన వినిపిస్తోంది.
మసీదుకు వెళితే వారు తరగతులకు దూరమవుతారని, అందుకే క్లాస్‌రూమ్‌ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారని అంటున్నారు… ఈ సంఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కోలారు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పాఠశాలను సందర్శించి విచారణ జరిపి, సమస్యపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ రేవణ సిద్ధప్పను ఆదేశించారు.
Source: Hindupost





