
పాటియాలా: భారతదేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో మతోన్మాదుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఎక్కడికక్కడే హిందువులను హింసించడం, హిందూ దేవతలను కించపరచడం, గుళ్ళు, గోపురాలను కూల్చడం వంటి దుర్ఘటనలు సర్వసాధారణమైపోయాయి. పోలీసు వైఖరీ మారడం లేదు. నిందితులు మానసిక రోగులని కొట్టిపారేయడం వల్ల దుండగులకు ఇదో అవకాశంగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి.
In another sacrilege attempt case in Punjab, the police in Patiala have nabbed a 23-year-old accused for allegedly making an attempt of sacrilege at Shri Kali Devi Temple in Patiala. #Video #Punjab #Sacrilege #KaliDeviTemple pic.twitter.com/P7Td87APbu
— Organiser Weekly (@eOrganiser) January 24, 2022
తాజాగా, పంజాబ్‌లోని పాటియాలలో ఓ దుష్టుడు ఏకంగా కాళీమాతనే కదిలించి, పారేయాలనుకొన్నాడు. అయితే, అక్కడి పోలీసులు, స్థానిక సిబ్బంది గట్టిగా ఆ నిందితుడిని నెట్టివేయడంతో ఘోరం త్రుటిలో తప్పిపోయింది. శ్రీ కాళీ దేవి ఆలయంలో 23 ఏళ్ళ యువకుడు ప్రార్థన చేస్తూ ఒక్కసారిగా కాళీకాదేవి విగ్రహం వద్ద వెళ్ళి, ఇరువైపులా పట్టుకుని అక్కడి నుంచి తొలగించేందుకు విశ్వప్రయతం చేశాడు. అయితే, విగ్రహం ఒక ఇంచి కూడా కదల్లేదు. కేసు దర్యాప్తులో ఉన్నది. ఈ సంఘటన ఆర్గనైజర్ ట్విట్టర్ ద్వారా నిన్న పోస్టు చేసింది.
Source: Organiser