News

‘బనారస్‌’లో ‘హిందూ ధర్మం’పై కోర్సు ప్రారంభం

496views
  • దేశంలో తొలిసారి..

  • 45 మంది విద్యార్థుల చేరిక

వారణాసి: వారణాసిలోని ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌ యూ) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. దేశంలో హిందూ ధర్మంపై మొట్టమొదటి కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. హిందూ స్టడీస్‌పై పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ప్రారంభించింది.

ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ విభాగం ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. యూనివర్సిటీకి చెందిన భారత్‌ అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్‌, ప్రొఫెసర్‌ సదాశివ కమార్‌ ద్వివేది దీని గురించి మాట్లాడుతూ.. ఒక విదేశీ విద్యార్థి సహా మొత్తం 45 మంది విద్యార్థులు ఈ కోర్సు మొదటి బ్యాచ్‌లో చేరినట్టు తెలిపారు. రెండేళ్ళ కోర్సు, నాలుగు సెమిస్టర్లుగా, 16 పేపర్లతో ఉంటుందన్నారు.

ఇక ఈ కోర్సును మంగళవారం యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ వీకే శుక్లా ప్రారంభించారు. నూతన విద్యా విధానం 2020 కింద ఈ కోర్సు ఉంటుందని ఆయన తెలిపారు. కాగా, 1916లో బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఏర్పాటు కాగా.. హిందూ ధర్మంపై కోర్సు తీసుకురావడానికి వందేళ్ళకు పైగా పట్టింది.

Source: ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి