News

తిరుచానూరులో శ్రీయాగం ప్రారంభం

556views

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో శ్రీ‌యాగం శుక్ర‌వారం అత్యంత వైభ‌వంగా ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ చేప‌ట్టిన ఈ యాగం ఈ నెల 27 వ‌ర‌కు జ‌రుగుతుంది. కొవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో ఏకాంతంగా ఈ యాగం జ‌రుగుతుంది. ఈ రోజు ఉద‌యం 9.30 గంటలకు యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ యాగంలో భాగంగా మధ్యాహ్నం 1 గంట వరకు అగ్నిప్రతిష్ఠ, వేద విన్నపం, మహా మంగళహారతి చేపట్టారు. ఈ సాయంత్రం అయిదు గంటల నుంచి చతుష్టానార్చాన, శ్రీయాగం హోమాలు, లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి