News

శ్రీవారి దర్శనానికి ఉచిత టికెట్లు

515views

తిరుప‌తి: తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు అయిదు వేల చొప్పున 50వేల టికెట్లను జారీ చేయనుంది.

రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి దేవ‌స్థానం ఈ టికెట్లను జారీ చేయనుండగా తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లి, సత్యనారాయణపురం జడ్పీ పాఠశాల బైరాగిపట్టెడ రామనాయుడు పాఠశాల, కార్పొరేషన్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి