News

అవనిగడ్డలోని భద్రాద్రి రామయ్య భూములకు ‘పట్ట’ భద్రత

222views

అవనిగడ్డ: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని భద్రాద్రి రాముడి భూములకు భద్రత కల్పించి పట్టాదారు పాసు పుస్తకాలు కోడూరు రెవిన్యూ శాఖ వారు అందించారు. కోడూరు మండలం మందపాకల, పోటుమిద గ్రామ రెవెన్యూ పరిధిలోని భద్రాచలం సీతారాములస్వామి వారికి సంబంధించిన 8.8ఎకరాలు కబ్జాకు గుర‌య్యాయి. ఈ విషయాన్ని స్థానికులు హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో వారు భూమిని పరిశీలించి, కబ్జా అయిన విధానంను ఒక నివేదిక రూపములో భద్రాచల శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానం ఈఓ గారికి అందించారు.

పెద్ద ఎత్తున ఈ వివాదం రెండు తెలుగు రాష్ట్రల వ్యాప్తంగా సంచలనమైంది. తర్వాత ఆలయ అధికారులు, హెచ్‌.డి.పి.టి వారి సమక్షంలో భూములను పరిశీలించి, ఆలయ అధికారులు ఈ విషయమై కోడూరు రెవిన్యూ వారిని సంప్రదించారు. త‌ర్వాత వారు సాగుభూముల పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు.

వీటిని కోడూరు మండలం త‌హ‌శీల్దార్ ఎస్‌.కె లతీఫ్ పాషా భద్రాచలంస్వామి వారి సన్నిధిలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి, సిబ్బంది, త‌హ‌శీల్దార్ఎను ఘనంగా సన్మానించారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాకు గురైన దేవాలయ భూములు విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకొని, రెవెన్యూ శాఖ వారి సహాయంతో తిరిగి దేవాలయాలకు అప్పగించాలని, న్యాయ స్థానాల్లో పెండింగ్ ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొర‌వ చూపి, హిందూ దేవాలయాలకు న్యాయం చేయాలని హిందూ సమాజం కోరుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి