News

ఖలిస్థాన్ సాహిత్యం పంపిణీ, ముగ్గురి అరెస్ట్

589views

పంజాబ్: పంజాబ్‌లో ఇటీవల ముగ్గురు ఖలిస్తాన్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఖలిస్తాన్‌కు అనుకూలంగా బోధించినందుకు జగ్మీత్ సింగ్, రవీందర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను బనూర్ ప్రాంతానికి సమీపంలోని ఒక ప్రదేశంలో అరెస్టు చేసినట్టు పాటియాలా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్‌.ఎస్‌.పి.) హర్చరణ్ సింగ్ భుల్లర్ తెలిపారు.

నిందితులు వివిధ మతపరమైన, బహిరంగ ప్రదేశాలను సందర్శిస్తున్నారని, ఖలిస్తాన్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓటు వేయడానికి ప్రజలకు కొన్ని రిజిస్ట్రేషన్ ఫారమ్‌లను పంపిణీ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఖలిస్థాన్ అనుకూల మెటీరియల్‌ను జగ్మీత్ సింగ్ తల్లి జస్వీర్ కౌర్ అందించారు. ఆమెను కూడా అరెస్టు చేశారు. నిందితుల‌ వద్ద నుండి పెద్ద మొత్తంలో ఖలిస్థాన్ అనుకూల మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌.ఎస్‌.పి. తెలిపారు.

Source: Hindupost

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి