
493views
నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కర్ణకమ్మవీధిలోని హరిహర క్షేత్రంలో శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామివారి తిరుప్పావై సేవ వేడుకగా జరిగింది. స్వామికి తిరుమంజనం, సుప్రభాతసేవ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో పులిహోర, డ్రైఫ్రూట్స్, పలు రకాల పదార్థాలతో వేంకటేశ్వరస్వామి రూపాన్ని తీర్చిదిద్దారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Source: EtvBharat





