
-
శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు శుభవార్త చెప్పారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా తిరుమల దర్శనానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలామంది భక్తులకు స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కలగలేదు. అటువంటి వారు ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. నవంబరు 18 నుంచి డిసెంబరు 10వ తేదీ వరకు టికెట్లు కలిగి, దర్శనం చేసుకోలేకపోయిన భక్తుల వినతి మేరకు టీటీటీ వారికి ఆరు నెలల్లోపు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది.
అయితే, తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఆ టికెట్లపై అనుమతి ఉండదని ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనం కారణంగా ఈ తేదీలు మినహాయించి వారు మరి ఏ తేదీల్లోనైనా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని టీటీటీ తెలిపింది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు.
Source: Tv9