
తిరువనంతపురం: కేరళలోని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్‌డిపిఐ) భారీగా మారణాయుధాలను సేకరించి, నిల్వ చేస్తోంది. తిరువనంతపురంలోని ముత్తతర పత్తి పొలంలోని ఉన్న ఎస్‌డిపిఐ కార్యకర్త సోదరుడి ఇంట్లోని ఉపయోగించని ఫ్రిజ్‌లో కత్తులు బయటపడ్డాయి.
రాష్ట్రంలో విస్తృతంగా అల్లర్లకు ఎస్.డి.పి.ఐ, పి.ఎఫ్.ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) సిద్ధమవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పారుతికుజిలోని సీ.ఎస్.ఐ మసీదు సమీపంలోని ఉబైద్ ఇల్లు ఉంది. ఉబైద్ ఎస్.డి.పి.ఐ కార్యకర్త సోదరుడు.
నగరపాలక సంస్థ సిబ్బంది డెంగ్యూ నివారణ చర్యల్లో భాగంగా ఆ ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసేందుకు వెళ్ళారు. ఇంటి బయట ఉంచిన పాత ఫ్రిజ్‌ని తెరిచి చూడగా ఆయుధాలు కనిపించడంతో అవాక్కయ్యారు. ఫ్రిజ్‌లో మొత్తం అయిదు కత్తులు కనిపించాయి.
తమ మొబైల్ ఫోన్లలో ఆ ఆయుధాలను చిత్రీకరించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరస్ కావడంతో స్థానికులు పూంతుర పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెతకడానికి వచ్చారు. కానీ, అప్పటికి ఎవరో ఆ ఆయుధాలను దాచిపెట్టారు.
పోలీసులతో ఉబైద్ వాగ్వివాదానికి దిగాడు. వాటిని తన ఇంట్లో ఎవరైనా పెట్టి ఉండొచ్చని చెప్పాడు. అయితే, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఉబైద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.
ఉబైద్, అతని కుటుంబం ఇటీవలే బీమపల్లి నుండి పరుత్తికుజికి మారింది. బీమపల్లి పేరు పోలీసు రికార్డుల్లో నమోదై ఉన్నది. ఆయుధాలు కనిపించిన ఇల్లు ఆర్ఎస్ఎస్ శాఖ జరిగే స్థలానికి సమీపంలో ఉంది.
బీమపల్లి సహా పలు చోట్ల ఉన్న ఎస్.డి.పి.ఐ సభ్యుల ఇళ్లలో, వారి రహస్య స్థావరాల్లో ఆయుధాలు నిల్వ ఉంచినట్టు గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయంలో పోలీసుల నుంచి చెప్పుకోదగ్గ విచారణ జరగలేదు. తాజాగా కనిపించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకోవలసి ఉంది.
ఎస్.డి.పి.ఐ, పి.ఎఫ్.ఐ.. రాష్ట్ర స్థాయి బి.జె.పి, ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెలువడిన నివేదికల మధ్య ఈ సంఘటన బయటపడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పాలక్కాడ్‌లో సంజీత్, అలప్పుజాలో రెంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరిగింది. పారుతికుజి వద్ద జరిగిన ఘటన యాదృచ్ఛికం కాదని స్థానికులు చెబుతున్నారు.
Source: Hindupost





