News

నాగపూర్ ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి రెక్కీ

665views
  • రెడ్ అలర్ట్ ప్ర‌క‌టించిన భ‌ద్ర‌తా ద‌ళాలు

నాగ్‌పూర్‌: నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వార్టర్స్‌పై ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ దాడుల కోసం రెక్కీ జరగడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఓ ఉగ్రవాది రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. ఉగ్రవాది పట్టుబడ్డాడా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.

‘ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాది రెక్కీ నిర్వహించినట్టు కొద్ది రోజుల క్రితం సమాచారం అందింది’ అని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. జైషే దాడికి అవకాశం ఉన్న దృష్ట్యా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి భద్రతను పెంచామన్నారు. నిఘా సంస్థ నుంచి అందిన సమాచారం మేరకు నాగ్‌పూర్‌లో అలర్ట్ ప్రకటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి