
437views
ముంబయి: ముంబయి పోలీసులకు ఖలిస్థానీల నుంచి బెదిరింపు వచ్చింది. నగరంలో వారు ఉగ్రదాడులకు పాల్పడతారనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్ 31 పోలీసులు నగరవ్యాప్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు.
ముంబయిలోని ప్రధాన ప్రాంతాలైన దదర్, బంద్రా చర్చ్‌గేట్, సీఎస్ఎంటీ, కుర్లా.. తదితర స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే మూడు వేలమంది రైల్వే అధికారులు నగరవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లలో విధులు నిర్వర్తించనున్నట్టు ముంబయి రైల్వే అధికారి తెలిపారు.





