News

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌, ఉగ్ర‌వాదుల హ‌తం!

1.1kviews

జ‌మ్ముక‌శ్మీర్‌: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్​లోని పంథా చౌక్‌​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు కూడా గాయపడ్డారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. మృతుల్లో ఒకరిని సుహేల్​ అహ్మద్​గా పోలీసులు గుర్తించారు. అతనికి జైషే మహ్మద్​తో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు.

పంథా చౌక్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వాహించారు. ఈ క్రమంలోనే ముష్కరులు భద్రతాదళాలపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఎన్​కౌంటర్​ ప్రారంభమైనట్టు అధికారులు వెల్ల‌డించారు. కాశ్మీర్​ పోలీసులు, సీఆర్​పీఎఫ్​ సిబ్బంది ఉమ్మడిగా చేపట్టిని ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు పోలీసులు, మరో సీఆర్​పీఎఫ్​ జవాన్​కు గాయాలైనట్టు వివరించారు. వీరిని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి