News

బాలికపై పాస్టర్ అత్యాచారం!

523views
  • బ్లాక్ మెయిల్ కోసం భార్య వీడియో రికార్డింగ్‌

  • ఇద్ద‌రి అరెస్ట్‌

గుజరాత్: ప్రార్థనల కోసం చర్చికి వెళ్లిన బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. నిందితుడి భార్య‌ బ్లాక్ మెయిల్ కోసం వీడియో రికార్డ్ చేసింది. పోలీసులు వీరిద్ద‌రిని అరెస్టు చేశారు. ఈ దుర్ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని తాపీ జిల్లా, సోంగాధ్ తాలూకాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మేలో జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఫిర్యాదు మంగళవారం సోంగాధ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది.

పాస్టర్ బలిరామ్ కొక్నీ, అతని భార్య అనితను కోర్టులో హాజరుపరిచారు. వీరిద్దరిని నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి పంపారు. బాలిక వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ప్రార్థనల కోసం చర్చికి వెళ్లింది. దీంతో నిందితుడు ఆమెతో పాటు తల్లిదండ్రులతో పరిచయాలు పెంచుకున్నాడు. పాస్టర్, అతని భార్య ఆమెను బ్యాంకులో కేవైసీ పూర్తి చేయాలనే నెపంతో సోంగాధ్‌కు పిలిచి, ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

మే నెలలో తన పొలంలోని గుడిసెలో బాలికపై తొలిసారి అత్యాచారం జరిగిందని సందేశ్‌లోని ఒక కథనం పేర్కొంది. మరుసటి రోజు కూడా పాస్టర్ తన బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తానని చెప్పి ఆమెను రప్పించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఈ రెండు దాడుల సమయంలో పాస్టర్ భార్య అనిత కూడా ఉన్నట్టు సమాచారం. 31 మే 2021న, ఆమె కేవైసీ పూర్తి చేయాలనే సాకుతో జంట మళ్లీ ఆమెను సోంగాధ్‌కు పిలిచారు. అక్కడ ఆమె మూడోసారి అత్యాచారానికి గురైంది.

ఆశ్చర్యకరంగా, పాస్టర్ భార్య అనిత ఫోన్‌లో ఈ ఘోరమైన నేరాన్ని రికార్డ్ చేసింది. ఆ చిత్రాలు, క్లిప్‌లతో తనను బ్లాక్‌మెయిల్ చేశారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది. తన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయ‌నే భయంతో ఇంతకు ముందు ఫిర్యాదు చేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి