397
-
రాకేష్ టికాయత్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రైతులు క్షమాపణలు కోరుకోవడం లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. విదేశాల్లో ఆయనకున్న పేరుప్రఖ్యాతలకు భంగం కలిగించడం తమకు ఇష్టం లేదని, అందుకే క్షమాపణలు వద్దని ట్వీట్ చేశారు. సాగు చట్టాలను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న కొన్ని రోజుల తర్వాత టికాయిత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అఖిలేష్ యాదవ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన టికాయత్
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేఖ్ యాదవ్ ఆహ్వానాన్ని రైతు నేత రాకేశ్ టికాయిత్ తిరస్కరించారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.