News

తమిళనాడు చరిత్రలోనే అతి పెద్ద డ్రగ్స్ ఆపరేషన్

644views
  • 23 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

  • అదుపులో 6,623 మంది

చెన్నై: మాదకద్రవ్యాలపై.. తమిళనాడువ్యాప్తంగా గత 20 రోజులుగా భారీ స్థాయిలో జరుగుతున్న ఆపరేషన్​లో ఇప్పటివరకు రూ. 23 కోట్లు విలువగల హెరాయిన్​, రూ. 4.2 కోట్లు విలువ చేసే గుట్కా, రూ. 18 కోట్లు విలువ చేసే గంజాయిని అధికారులు జప్తు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 6,623 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా తూత్తుకుడిలో 23 కిలోల‌ హెరాయిన్​ బయటపడింది.

పోలీసులు ఏడుగురిని అరెస్ట్​ చేశారు. మరోవైపు గంజాయి అక్రమ రవాణా విషయంలో మూడు వారాల్లో ఏకంగా 816 కేసులు నమోదయ్యాయి. 871 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 1.88కోట్ల గంజాయిని పట్టుకున్నారు. డ్రగ్స్​ను పట్టుకునే విషయంలో ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. డ్రగ్​ డీలర్ల సమాచారం తెలిస్తే వాట్సాప్​ ద్వారా తమకు చెప్పాలని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి