
621views
లండన్: బ్రిటన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్ సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చాయి. ఇంగ్లాండ్‌లో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చే అంశంపై ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గం సోమవారం సమీక్షించనుంది. ప్రస్తుతానికి ఇంటి నుంచే పని, మాస్క్, కొవిడ్ టీకా ధ్రువపత్రం తప్పనిసరి వంటి ప్లాన్ బీ చర్యలు అమలులో ఉన్నాయి. మరోవైపు.. వేల్స్లో రాత్రి క్లబ్‌లు ఆదివారం నుంచి మూసివేయాలని ఆదేశించారు. పబ్బులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లల్లో ఆరుగురుకి మించి గుమికూడదు. ఇండోర్ ఈవెంట్స్‌కు 30 మంది, బహిరంగ ప్రదేశాల్లో 50 మందికి మాత్రమే అనుమతిస్తున్నారు.





