
626views
విజయవాడ: విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు జరుగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా, 4 నుంచి 5 లక్షల మధ్య భవానీలు అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక భవానీల రద్దీ దృష్ట్యా మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు అధికారులు.
జల్లు స్నానాల కోసం 500 షవర్లు, ఇరుముడులు సమర్పించేందుకు 50 స్టాండ్లతో పాటు గురు భవానీలను సిద్ధం చేశారు. దుర్గగుడి అధికారులు. కొండ చుట్టూ దాదాపు పది కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షణకు అనుమతి ఇచ్చారు. మార్గం మధ్యలో భవానీలకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు.
Source: Tv9





