
-
తాజాగా దుర్గమ్మ ఆలయం ధ్వంసం
-
నిందితుడు మహ్మద్ వలీద్ షబ్బీర్ అరెస్టు
కరాచీ: ఆ దేశంలోని ప్రజలకు తినడానికి తిండి లేదు… కనీస సౌకర్యాలు లేవు. కానీ, అక్కడున్న దుష్టశక్తులకు మాత్రం అమాయిక హిందువులపై పగ పోవడం లేదు. మతవిద్వేషాలు సృష్టిస్తారు.. హిందూ దేవాలయలను ధ్వంసం చేస్తారు… హిందువులను హింసిస్తారు.. మతం మార్చుతారు… లేదా హత్య చేస్తారు. ఇదీ ఆ గడ్డపై నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలు! ఆ దేశమే పాకిస్తాన్! దీనికి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈయన పాలనలో దేశంలో అభివృద్ధి లేదు సరికదా… ఊహించని విధంగా దిగజారిపోతోంది.

పాలనా దమ్ము లేని ఇమ్రాన్ ఖాన్ వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడి ఆరాచక శక్తులు వారు నమ్ముకున్న దైవపూజ కంటే దుర్ఘటనలకే అధిక ప్రాధాన్యమిస్తారు. తాజాగా… కరాచీలోని నారాయణ్ పురా ప్రాంతంలో దుర్గామాత ఆలయంపై దాడి జరిగింది. దుర్గామాత విగ్రహాలను ధ్వంసమయ్యాయి. 22 నెలల్లో హిందూ దేవాలయాలపై పాకిస్థాన్‌లోని ఇస్లాంవాదులు జరిపిన తొమ్మిదో దాడిని కొందరంటున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి దుర్గా విగ్రహం తల తెగిపడిపోయింది. మరో దేవత విగ్రహం ధ్వంసం చేశారు. దాడిలో దుర్గా విగ్రహం మొండెం కూడా విరిగిపోయిందని, ఆలయం పూర్తిగా ధ్వంసమైందని సమాచారం. అమ్మవారి వాహనమైన పులి బొమ్మను కూడా ధ్వంసం చేసి ఉండడాన్ని మనం వైరల్ వీడియోలో చూడొచ్చు. ఆలయంలోని పటాలను కూడా కింద పడేసి పగులగొట్టారు.
నిందితుడు మహ్మద్ వలీద్ షబ్బీర్ అరెస్టు
Another Hindu Temple attacked in Islamic state of Pakistan.
Attack on Narian Pora Hindu Temple in Karachi. This is 9th attack on Hindu Temple in 22 months.
It happens when culprits are allowed to walk free. pic.twitter.com/1wUHBazgIu
— Fazila Baloch?☀️ (@IFazilaBaloch) December 20, 2021
ఈ ఘటనకు సంబంధించి మహ్మద్ వలీద్ షబ్బీర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు పాక్ మీడియా తెలిపింది. తన భార్యతో కలిసి ఆలయంలో ఉన్న ఒక హిందూ వ్యక్తి ముఖేష్ కుమార్ మహమ్మద్ విగ్రహాలను సుత్తితో పగులగొడుతూ ఉండడాన్ని చూశాడు. చివరకు పోలీసులు అప్రమత్తమై అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆలయం ఉన్న ప్రాంతంలో పేద హిందూ కుటుంబాలు నివసిస్తున్నాయి. హిందువులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనలు చేపట్టారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో పాకిస్థాన్‌లోని ఛాందసవాదుల గుంపు పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోని గణేష్ ఆలయంపై దాడి చేసింది. ఆలయ భాగాలను తగలబెట్టి, విగ్రహాలను అపవిత్రం చేసింది. ఆ గుంపు కర్రలు, రాళ్లు, ఇటుకలను తీసుకువెళ్లి, మతపరమైన నినాదాలు చేస్తూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసినట్టు అధికార పార్లమెంటు సభ్యుడు పేర్కొన్నారు.
ఛాందసవాదులకు వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి చర్యలు తీసుకునే దమ్ము లేదని స్పష్టంగా తెలుస్తోంది. మైనారిటీల దేవాలయాలను రక్షించడంలో అసమర్థత కారణంగా పాక్ లో హిందువులు ఉండడానికే భయపడుతూ ఉన్నారు.
Source: NationalistHub





