News

సరిహద్దులో పాక్ అక్రమ నిర్మాణాలు

356views

న్యూఢిల్లీ: సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. దీనిపై భారత ఆర్మీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని తీత్వాల్​ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ అసాధారణ నిర్మాణ కార్యకలాపాలను చేపట్టింది. దీనిపై లౌడ్​స్పీకర్ల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాం.

పాక్ నిర్మాణాలు చేపట్టిన ప్రదేశం భారత భూభాగానికి కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది” అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. దీంతో పాక్​ నిర్మాణపనులను నిలిపివేసిందని సదరు అధికారి తెలిపారు. అయితే.. పాక్ ఈ ప్రాంతంలో వేటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోందో తెలియదని చెప్పారు. నిబంధనల ప్రకారం.. ముందస్తు అనుమతి లేకుండా ఎల్​ఓసీ వెంబడి ఇరుపక్షాలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి