
538views
అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని బదులిస్తున్నట్టు తెలిసింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులు, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను.. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో డిపాజిట్ చేయాలంటూ సంప్రదింపులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీని కూడా పీఎఫ్ ట్రస్టు నిధుల కోసం కోరుతున్నారని తెలిసింది.
Source: EtvBharat





