News

శ‌బ‌రిమ‌ల‌లో రోజుకు 60 వేల మందికి అనుమతి

644views

తిరువ‌నంత‌పురం: కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచారు. సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో సాధారణ రోజుల్లో రెండు వేల మందిని, శని, ఆదివారాల్లో రోజుకు మూడు వేల మందిని అనుమతించనున్నారు. ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) ఆదివారం కొండపై ఉన్న పుణ్యక్షేత్రానికి భక్తుల రోజువారీ పరిమితిని 60,000 కు పెంచినట్టు తెలిపింది.

సంప్రదాయ మార్గంలో భక్తులను దర్శనానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు దేవస్వం మంత్రి కార్యాలయం తెలియజేసింది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘నెయ్యభిషేకం’ (నెయ్యితో అభిషేకం) చేసేందుకు భక్తులను అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి