News

పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసింది..

664views
  • ఆ దేశ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ఎప్పుడో దివాళా తీసిందంటూ పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మాజీ చైర్మన్ షబ్బర్ జైదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ దేశమే అయితే ఒక సంస్థగా దివాళా తీసింది… అయితే దేశంలో అంతా బాగుందని చెబుతున్నారు.. మార్పు తీసుకువస్తామని అంటున్నారు.. అయితే ఇందులో నిజం లేదు.. కానీ దివాళా తీసినా.. దైర్యం చెప్పడంలో తప్పులేదని అన్నారు. ప్రస్తుతం దేశం దివాళా తీసిందని తాను భావిస్తున్నాట్టు చెప్పారు.. అయితే దేశంలో అంతా బాగానే ఉందని, పనులు సవ్యంగా సాగుతున్నాయని ఇమ్రాన్ ప్రభుత్వం చెబుతున్న మాటలు అబద్ధాలని అన్నారు. దేశాభివృద్ధి కోసం ఇది చేస్తాం.. అది చేస్తామని చెప్పడం.. రాజకీయ నాయకులు తమ వాక్చాతుర్యంతో ప్రజలను మోసం చేయడమేనని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి