
614views
న్యూఢిల్లీ: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. భారత వైమానిక దళంలో అత్యుత్తమ ఛాపర్ పైలట్ అయిన ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్‌లతో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన ఒక్కొక్క బ్రిగేడియర్ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో విచారణ పూర్తి కానుంది.
ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే బృందాలు విచారణ ప్రారంభించాయి. సాక్ష్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో ఎయిర్ మార్షల్‌తో పాటు విచారణలో ఉన్న ఇద్దరు అధికారులు దక్షిణ ఆర్మీ కమాండ్‌కు చెందిన వారు. వీరిరువురు ఛాపర్ సంబంధిత విషయాల్లో నిపుణులని అధికారులు తెలిపారు.





