
-
ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కేసులు
లండన్: బ్రిటన్‌లో రికార్డ్ స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 88,376 కేసులు వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. కొవిడ్ ప్రారంభం నుంచి ఇంత పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటితో పాటు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా యూకే లో బాగా పెరిగాయి.
కొత్తగా 1,691 మందిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్టు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,708 కి చేరింది.
యూకేలో మరో 146 మంది వైరస్ కారణంగా చనిపోయినట్టు అధికారుల వెల్లడించారు. దీంతో మొత్తం మరణాలు 1,47,937 కు చేరాయి. అంతేగాకుండా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి బ్రిటన్‌లో ఎక్కువగా ఉండడం కారణంగా కేసులు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు రెండు నుంచి మూడు రోజుల్లో రెట్టింపు అవుతున్నాయని వైద్యాధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 16 నాటికి 25,477,345 మందికి బూస్టర్ డోసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.





