
411views
ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను కొందరు సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.
ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో అగంతుకులు బిట్ కాయిన్ ను ప్రమోట్ చేస్తూ పోస్టు చేశారు. భారత్ లో బిట్ కాయిన్ ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్ కాయిన్‌లు కొనుగోలు చేసి, ప్రజలకు పంచుతోందని లింక్ లు ట్వీట్ చేశారు. వెంటనే పీఎంఓ అధికారులు స్పందించి ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ట్విట్టర్ ప్రధాని ఖాతాను పునరుద్ధరించింది.






