
540views
-
కాలిఫోర్నియా కోర్టుకు వెళ్ళిన రోహింగ్యాలు
కాలిఫోర్నియా: మయన్మార్ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాల పోస్టులను అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్థులు 150 బిలియన్ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు రోహింగ్యాలు కాలిఫోర్నియా న్యాయస్థానం మెట్లు ఎక్కారు.
ఫేస్‌బుక్‌లో పోస్టు అయిన ప్రసంగాలు తమపట్ల హంసకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఫేస్బుక్.. మయన్మార్ సైన్యానికి సంబంధించి సమాచారం పోస్టుకాకుండా నిషేధం విధించడం సహా పలు కట్టడి చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. మూడో వ్యక్తి పోస్టు చేసిన సమాచారంపై చర్యలు చేపట్టకుండా అమెరికా అంతర్జాలం చట్టం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది.





