News

పాకిస్తాన్ కుటిల నీతి

568views
  • కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితికి మరో లేఖ

ఇస్లామాబాద్‌: కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరో లేఖ రాశాడు. ఆర్టికల్ 370, కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్​ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ, యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్​ అధ్యక్షునికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. కశ్మీర్ తమ అంతర్గత సమస్య, ​ ఈ అంశంలో పాకిస్థాన్ తలదూర్చవద్దని భారత్​ తరచుగా చెబుతున్నా.. పాకిస్థాన్ తన కుటిల నీతిని వదలడం లేదు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తరచూ లేవనెత్తుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి