
655views
వారణాసి: కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 13, 14న ‘దివ్య కాశీ భవ్య కాశీ’ వేడుకను బీజేపీ ఘనంగా నిర్వహించనుంది. 13న వారణాసిలో జరగనున్న ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ప్రధాని ఆహ్వానించారు. డిసెంబర్ 14న ‘సుపరిపాలన’ అంశంపై ప్రధానమంత్రి సెమినార్ నిర్వహిస్తారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ముచ్చటించనున్నారు. ప్రధానమంత్రి వారణాసిలోని యోగా కేంద్రమైన స్వర్వేద్ మహామందిర్ ధామ్‌ని సందర్శించనున్నారు.





