News

దేశ రక్షణకు సన్నద్ధంగా నేవీ

704views
  • భారత నౌకాదళ అధిపతి హరికుమార్ వెల్ల‌డి

న్యూఢిల్లీ: దేశ ఉత్తర సరిహద్దులోని పరిస్థితులు, కరోనా తదితర సవాళ్లను భారత నౌకాదళం సమర్థంగా ఎదుర్కొందని అధిపతి అడ్మిరల్ ఆర్​ హరి కుమార్ పేర్కొన్నారు. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా పథకం కింద 39 యుద్ధనౌకలు, జలాంతర్గాములు నేవీ కోసం నిర్మితమవుతున్నాయని అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు. అత్మనిర్భర భారత్ స్ఫూర్తిని నేవీ చాటుతోందని పేర్కొన్నారు. నేవీలో మహిళల పాత్రను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి