News

భారత విపణి వృద్ధికి కట్టుబడి ఉన్న గూగుల్

516views
  • సంస్థ అధినేత సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ: క్లౌడ్‌, ఏఐ, ఆండ్రాయిడ్‌ విభాగంలో కార్యకలాపాల ద్వారా భారత విపణి వృద్ధికి సహకారం అందించేందుకు గూగుల్‌ కట్టుబడి ఉందని హెచ్‌టీ లీడర్‌షిప్‌ సదస్సులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. అంతర్జాతీయంగా భారత కంపెనీలు తామేంటో నిరూపించుకుంటుండటం, యూనికార్న్‌లుగా అవతరించడం ప్రోత్సాహకర పరిణామమని చెప్పారు. తాము కూడా పలు మార్గాల్లో సహకారం అందిస్తున్నామని, భారత డిజిటైజేషన్‌ పథకాల్లో 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

భారత కంపెనీలకు సహకారం అందించడంతో పాటు ఏఐ, సాంకేతికతలను వాళ్లకు అందించాలని అనుకుంటున్నామని తెలిపారు. తద్వారా ఆ కంపెనీలు వాటి ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకు రాగలుతాయని, మరింత మంది వినియోగదార్లకూ చేరువవుతాయని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి