
552views
న్యూఢిల్లీ: జవాద్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల నాలుగోతేదీన తుఫాన్ ప్రభావం వల్ల పంటలకు భారీనష్టం కలిగించవచ్చని హెచ్చరించింది. రైతులు పొలాల్లో ఉన్న మొక్కజొన్నను కోయాలని బెంగాల్ సర్కారు సూచించింది.
దక్షిణ థాయ్‌లాండ్‌లోని అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ తెలిపింది. నాలుగోతేదీ ఉదయం ఒడిశా, ఆంధ్రా తీరాల మధ్య తీరం దాటే ముందు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్ వల్ల బంగాళాఖాతం తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉండి కోస్తా తీరంలో గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.





