News

దక్షిణాఫ్రికాలో రెట్టింపైన ఒమిక్రాన్ కేసులు

401views

జెనీవా: దక్షిణాఫ్రికాలో ఒమైక్రాన్ కేసులు ఒక్కరోజులో రెట్టింపయ్యాయి. ఈ వేరియెంట్‌ను గుర్తించిన తర్వాత దక్షిణాఫ్రికాలో పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. 4,373 పాజిటివ్ కేసులు బుధవారం ఒక్కరోజే 8,561కి చేరాయి. వారంలో కొత్త వేరియెంట్ కేసులు మూడు రెట్లు పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కేసుల భారీ పెరుగుదలతో ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి