
563views
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై వ్యాట్ 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 8 తగ్గనుంది. కొత్త రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. మరోవైపు, వరుసగా 27 రోజుల పాటు ఇంధన ధరలు యథాతథంగా కొనసాగాయి. అంతకుముందు కిందటి నెల నాలుగోతేదీన, ప్రభుత్వం పెట్రోల్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఇక దశలో రికార్డు స్థాయిలో నమోదైన పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చింది.
Source: Tv9





